: పది రోజుల్లో బోండా ఉమాకు సరైన న్యాయం చేస్తానని సీఎం హామీ ఇచ్చారు: ఎంపీ కేశినేని
పది రోజుల్లోగా ఎమ్మెల్యే బోండా ఉమాకు సరైన న్యాయం చేస్తానని సీఎం చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారని టీడీపీ ఎంపీ కేశినేని నాని అన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, పార్టీ కోసం పని చేస్తున్న బోండా ఉమాను చంద్రబాబు అభినందించారని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన ఎంతో కష్టపడ్డారని కితాబు ఇచ్చారని అన్నారు. వివిధ సమీకరణాల వల్ల ఉమకు న్యాయం చేయలేక పోయినట్లు సీఎం చెప్పారని కేశినేని అన్నారు.
కాగా, తనకు మంత్రి పదవి దక్కలేదని అలక బూనిన బోండా ఉమకు ఎంపీలు కేశినేని నాని, కొనకళ్ల నారాయణ, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నలు సర్ది చెప్పడం తెలిసిందే. అనంతరం, సీఎం చంద్రబాబు వద్దకు ఉమను తీసుకువెళ్లారు. మంత్రి పదవి ఇవ్వకపోవడానికి గల కారణాలను ఉమకు చంద్రబాబు వివరించి చెప్పినట్టు టీడీపీ వర్గాల సమాచారం.