: జమ్మూ-శ్రీనగర్ మధ్య సొరంగ మార్గాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ
దేశంలోనే అత్యంత పొడవైన సొరంగ మార్గాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. జమ్మూ-శ్రీనగర్ మధ్య సొరంగ మార్గాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై చెనాని-నష్రీ మధ్య నిర్మించిన ఈ సొరంగ మార్గం పొడవు 9 కిలోమీటర్లు. ఈ సొరంగ మార్గం ద్వారా వాహనాలు వెళ్లడం ద్వారా ఏడాదికి రూ.99 కోట్లు, రోజు కు రూ.27 లక్షల ఇంధనాన్ని పొదుపు చేసే అవకాశం ఉంటుంది. ఈ సొరంగమార్గం నిర్మాణం వల్ల 41 కిలోమీటర్ల దూరం 10.9 కిలోమీటర్లకు తగ్గిపోయింది.