: అసంతృప్తితో చంద్రబాబుకు లేఖ రాసిన టీడీపీ నేత బుచ్చయ్య చౌదరి


ఏపీ మంత్రి వర్గ విస్తరణలో ఫిరాయింపుదారులకు మంత్రి పదవులు కేటాయించడం అధికార పార్టీలోని సీనియర్ సభ్యులకు రుచించడం లేదు. ఇప్పటికే ఎమ్మెల్యేలు బోండా ఉమ పార్టీకి, తన పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించడంతో చంద్రబాబు ఆయన్ని బుజ్జగించడంతో మెత్తబడ్డారు. తాజాగా, టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి, సీఎం చంద్రబాబుకు ఓ లేఖ రాశారు. పార్టీ పదవికి రాజీనామా చేస్తున్నట్టు బుచ్చయ్య చౌదరి వెల్లడించారు. ఆయారాం, గయారాంలకు పదవులు ఇస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు.

  • Loading...

More Telugu News