: మైనార్టీలకు మంత్రి పదవి ఇవ్వకపోవడం దారుణం: ఎమ్మెల్యే జలీల్ ఖాన్
మైనార్టీలకు మంత్రి పదవి ఇవ్వకపోవడంపై తీవ్ర అలజడి నెలకొందని విజయవాడ టీడీపీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ అన్నారు. విజయవాడలో మైనార్టీ సంఘాలు, అనుచరులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఏపీలో మంత్రి వర్గ విస్తరణ విషయమై జలీల్ ఖాన్ మాట్లాడుతూ, 12 శాతం ఉన్న మైనార్టీలను విస్మరించడం దారుణమైన విషయమని, సీఎం చంద్రబాబు తలచుకుంటే మైనార్టీలకు మంత్రి పదవి ఇవ్వొచ్చని అన్నారు.