: ఇక రాజీనామా చేసేద్దాం.. ఎమ్మెల్యే ధూళిపాళ్ల వర్గీయుల మండిపాటు!
ఏపీ మంత్రి వర్గ విస్తరణలో గుంటూరు జిల్లా పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకు పదవి దక్కకపోవడంపై ఆయన వర్గీయులు మండిపడుతున్నారు. టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి నరేంద్ర రాజీనామా చేయాలంటూ వారు నినాదాలు చేశారు. కాగా, మంత్రి వర్గ విస్తరణలో తనకు పదవి దక్కక పోవడంపై అసంతృప్తితో ఉన్న నరేంద్ర, చింతలపూడి గ్రామంలోని స్వగృహంలో తన సన్నిహితులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పదవికి, టీడీపీ సభ్యత్వానికి నరేంద్ర రాజీనామా చేయాలంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. నరేంద్రకు మంత్రి పదవి ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ పార్టీ పదవులకు రాజీనామా చేయాలని టీడీపీ నేతలు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.