: బొజ్జలకు మద్దతుగా రాజీనామాలు మొదలుపెట్టిన ప్రజా ప్రతినిధులు!
క్యాబినెట్ నుంచి తమ నేత బొజ్జల గోపాలకృష్ణారెడ్డిని తొలగించారన్న ఆగ్రహంతో చిత్తూరు జిల్లాలో పలువురు స్థానిక ప్రజా ప్రతినిధులు రాజీనామాలు సమర్పించారు. ఇప్పటికే బొజ్జల, స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా చేసిన లేఖను చంద్రబాబుకు, కోడెలకు పంపించిన సంగతి తెలిసిందే. బొజ్జలకు మద్దతుగా తొట్టెంబేడు ఎంపీపీ పోలమ్మ, టీడీపీ అధ్యక్షుడు మురళీ నాయుడు, జడ్పీటీసీ సభ్యురాలు అనసూయమ్మ, కాపుగున్నేరి సింగిల్ విండో చైర్మన్ రవీంద్రనాథ్ తదితరులు రాజీనామాలు చేశారు. కాగా, బొజ్జలను బుజ్జగించేందుకు సీనియర్లను చంద్రబాబు రంగంలోకి దించినట్టు తెలిసింది.