: మొదలైన అసంతృప్తుల ముసలం... స్పీకర్ కు రాజీనామా లేఖ పంపిన బొజ్జల
తనను మంత్రి పదవికి దూరం చేయడంతో అలకబూని, మంత్రి పదవితో పాటు ఎమ్మెల్యే పదవికీ రాజీనామా చేస్తానని చెప్పి టీడీపీలో కలకలం రేపిన బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, అన్నంతపనీ చేశారు. తన రాజీనామా లేఖను స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు ఆయన పంపించారు. దీంతో ఒకింత షాక్ కు గురైన చంద్రబాబు, ఆయనను బుజ్జగించే ప్రయత్నాలు ప్రారంభించినట్టు తెలుస్తోంది. బొజ్జలకు సముచిత స్థానం కల్పిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చినట్టు సమాచారం. తాను మాత్రం రాజీనామాకే కట్టుబడి వున్నట్టు బొజ్జల స్పష్టం చేస్తున్నట్టు తెలుస్తోంది.