: కొలంబియాలో పెను విషాదం.. విరిగిపడిన కొండ చరియలు.. 206 మంది దుర్మరణం


దక్షిణ అమెరికాలోని కొలంబియాలో పెను విషాదం చోటుచేసుకుంది. కొండ చరియలు విరిగిపడి 206 మంది మృతి చెందగా వందలాది మంది తీవ్రంగా గాయపడ్డారు. వేలాది గృహాలు నేలమట్టమయ్యాయి. నైరుతి కొలంబియన్ పట్టణమైన మొకోవాలో శుక్రవారం పొద్దుపోయాక ఈ ఘటన చోటుచేసుకుంది. కొండ చరియలు విరిగిపడడంతో ఇళ్లు, బ్రిడ్జిలు, వాహనాలు, చెట్లు బురదలో కూరుకుపోయాయని అధికారులు తెలిపారు.

తాజా సమాచారం ప్రకారం 206 మంది చనిపోయారని, 202 మంది గాయపడగా 220 మంది కనిపించకుండా పోయారని, చుట్టుపక్కల 17 ప్రాంతాలపైనా ఈ ప్రభావం పడిందని కొలంబియన్ రెడ్‌క్రాస్ చీఫ్ సీజర్ ఉరుయెనా శనివారం తెలిపారు.  అధ్యక్షుడు జాన్ మాన్యుయెల్ సంతోస్ శనివారం మొకోవాను సందర్శించారు. ప్రజారోగ్యం, సేఫ్టీ ఎమర్జజెన్సీని ప్రకటించారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని ఆదేశించారు.

  • Loading...

More Telugu News