: ఫిరాయించిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వద్దంటూ రాజ్ భవన్ ఎదుట వీహెచ్ మెరుపు ధర్నా
ఒక పార్టీ టికెట్ పై గెలిచి, రాజీనామా చేయకుండా మరో పార్టీలోకి ఫిరాయించిన వారికి మంత్రి పదవులు ఎందుకు ఇస్తున్నారని ప్రశ్నిస్తూ, కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు రాజ్ భవన్ ఎదుట మెరుపు ధర్నాకు దిగారు. గవర్నర్ నివాసంలోకి దూసుకెళ్లేందుకు తన అనుచరులతో పాటు ఆయన ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వీహెచ్ మాట్లాడుతూ, ఫిరాయింపుదారులకు మంత్రి పదవులు అప్పగిస్తున్న వైఖరిని ఎండగట్టారు. గవర్నర్ సైతం రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. వీహెచ్ ధర్నాతో నిన్న రాజ్ భవన్ వద్ద కాసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.