: టీవీ సీరియల్‌గా ‘బాహుబలి’.. ప్రకటించిన రాజమౌళి


ఒకే ఒక్క సినిమాతో యావత్ సినీ ప్రపంచాన్ని తనవైపు తిప్పుకున్న టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు. బాహుబలిని మినీ టీవీ సీరియల్‌గా రూపొందించనున్నట్టు పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రసారమవుతున్న టీవీ సీరియళ్లకు భిన్నంగా 13 ఎపిసోడ్లతో మినీ టీవీ సీరియల్‌ను రూపొందించాలనుకుంటున్నట్టు ఆయన తెలిపారు.

ప్రముఖ రచయిత నీలకంఠన్ బాహుబలి సినిమా కథకు ముందస్తు ఘట్టాలతో (ప్రీక్వెల్) మూడు భాగాలుగా ‘ది రైజ్ ఆఫ్ శివగామి’ అనే పేరుతో పుస్తకం రాస్తున్నారు. ఇందులో భాగంగా తొలి పుస్తకాన్ని రాజమౌళి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీలకంఠన్ రాసిన పుస్తకాన్ని చదివానని, అందులోని ప్రతిపాత్ర తనను ఆకట్టుకుందని అన్నారు. శివగామి పాత్రను అద్భుతంగా తీర్చిదిద్దారని కితాబిచ్చారు. దీని ఆధారంగా మినీ టీవీ సీరియల్ నిర్మిస్తానని తెలిపారు. నీలకంఠన్ మాట్లాడుతూ మాహిష్మతి సామ్రాజ్ఞిగా శివగామి ఎదిగిన వైనాన్ని పుస్తకంలో వివరించినట్టు చెప్పారు. అలాగే కట్టప్ప పడిన అంతర్మథనాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేసినట్టు పేర్కొన్నారు. సినిమా కథలో లేని 40 కొత్త పాత్రలను ఈ పుస్తకం కోసం రచయిత సృష్టించారు.

  • Loading...

More Telugu News