: ఆదాయానికి మించి ఆస్తుల వ్యవహారంలో ఏపీ ఆర్ అండ్ బీ చీఫ్ ఇంజనీర్ ఎం.గంగాధర్ అరెస్టు
ఆంధ్రప్రదేశ్ ఆర్ అండ్ బీ చీఫ్ ఇంజనీర్ ఎం.గంగాధర్ నివాసాలతో పాటు ఆయన బంధువుల ఇళ్లలో ఏసీబీ అధికారులు ఈ రోజు విస్తృతంగా సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. తవ్వేకొద్దీ ఆయన నివాసాల్లో ఆస్తులు బయటపడడంతో గంగాధర్‌ను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ఆయనను కాసేపట్లో హైదరాబాద్ నుంచి విశాఖపట్నానికి తరలించనున్నారు. అక్కడి ఏసీబీ కోర్టులో ఆయనను అధికారులు హాజరుపరుస్తారు. ఈ రోజు మొత్తం 8 ప్రాంతాల్లోని 20 చోట్ల ఏసీబీ దాడులు నిర్వహించింది. దాడుల ఫలితంగా ఆయనకు భారీగా అక్రమాస్తులు ఉన్నాయని తేలింది.