: హైదరాబాదులో గేల్, యువీ.. ప్రాక్టీస్ షురూ!
టీమిండియా, వెస్టిండీస్ విధ్వంసకర ఆటగాళ్లు యువరాజ్ సింగ్, క్రిస్ గేల్ లు హైదరాబాదులో కలిశారు. ఐపీఎల్ సీజన్ 10లో ఆడేందుకు వీరిద్దరూ హైదరాబాదు చేరుకున్నారు. ఐపీఎల్ సీజన్ 10 తొలి మ్యాచ్ సన్ రైజర్స్ హైదరాబాదు జట్టు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య ఏప్రిల్ 5న ప్రారంభ వేడుకలు జరిగిన రోజు మ్యాచ్ జరగనుంది. దీంతో సన్ రైజర్స్ జట్టు హైదరాబాదులోని ఉప్పల్ స్టేడియంలో ప్రాక్టీస్ ప్రారంభించింది. తొలి మ్యాచ్ కోసం బెంగళూరు ఆటగాళ్లు కూడా ప్రాక్టీస్ కోసం హైదరాబాదు చేరుకున్నారు. ఈ క్రమంలో ప్రాక్టీస్ ముందు వీరిద్దరూ కలుసుకున్నారు. ఈ సందర్భంగా దిగిన సెల్పీని యువీ తన ట్విట్టర్ లో పోస్టు చేశాడు. గేల్ ను కలవడం ఆనందంగా ఉందని పేర్కొన్నాడు. కాగా, కోహ్లీ, డివిలియర్స్ గైర్హాజరీ నేపథ్యంలో బెంగళూరు జట్టు బ్యాటింగ్ బాధ్యతను గేల్ యువఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ తో కలిసి మోయనున్నాడు.