: నా కుమారుడు అఖిలేశ్ నన్నే మోసం చేశాడు: ములాయం సింగ్‌ ఆగ్రహం


ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల ముందు స‌మాజ్‌వాదీ పార్టీలో కుటుంబ క‌ల‌హాల వ‌ల్ల విభేదాలు భ‌గ్గుమ‌న్న విష‌యం తెలిసిందే. అయితే, తాజాగా ఆ పార్టీలో మళ్లీ విభేదాలు చెల‌రేగుతున్న‌ట్లు తెలుస్తోంది. స‌మాజ్‌వాదీ పార్టీ ఓట‌మి పాల‌వ‌డంతో నిరాశ‌లో ఉన్న ఆ పార్టీ నేత‌లు అఖిలేశ్ యాద‌వ్ నాయ‌క‌త్వంపై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ఈ రోజు ఎస్పీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ కూడా త‌న కుమారుడు అఖ‌లేశ్‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు. మెయిన్‌పురిలో పార్టీ కార్యకర్తలతో ములాయం మాట్లాడుతూ.. అఖిలేశ్ త‌న‌నే మోసం చేశాడని, ఇక‌ బాబాయ్‌ శివపాల్‌ సింగ్‌ను తొలగించడంపై ఎందుకు ఆశ్చర్యపోతున్నారని వ్యాఖ్యానించారు.

పార్టీకి చెందిన మరో సీనియర్ నేత మాట్లాడుతూ.. ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నికల వరకే త‌మ‌ పార్టీని తన అధీనంలో ఉంచమని అఖిలేశ్‌ కోరారని అన్నారు. అయితే, అఖ‌లేశ్ నిన్నటి పరీక్షలో ఫెయిల్‌ అయ్యారని, ఇక‌ పార్టీ బాధ్యతలను నేతాజీ (ములాయం)కి అప్పగించాలని ఆయ‌న డిమాండ్ చేశారు. మ‌రోవైపు కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడం, పార్టీ బాధ్యతలను అఖిలేశ్‌కు అప్పగించడం వల్లే ఓట‌మి ఎదురైంద‌ని మ‌రికొంద‌రు ఎస్పీ నేత‌లు అన్నారు.  

  • Loading...

More Telugu News