: ఐపీఎల్ కు హేమా హేమీలు దూరం... జాబితాలో కోహ్లీ, అశ్విన్, మురళీ విజయ్!
ఈ సారి ఐపీఎల్ మ్యాచులు కొంత కళతప్పనున్నాయా...? చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. ఏప్రిల్ 5న ప్రారంభమయ్యే ఐపీఎల్ పదవ ఎడిషన్ కు హేమా హేమీలూ దూరం అవుతున్నారు. తొలి మ్యాచ్ ఈ నెల 5న ఉదయం హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో హైదరాబాద్ సన్ రైజర్స్, బెంగళూరు రాయల్ చాలెంజర్స్ జట్ల మధ్య జరగనుంది. రాయల్ చాలెంజర్స్ జట్టుకు కెప్టెన్ గా విరాట్ కోహ్లీ ఉన్న విషయం తెలిసిందే. కోహ్లీకి కొన్ని రోజుల పాటు విశ్రాంతి అవసరమంటూ బీసీసీఐ వైద్య సిబ్బంది సూచించడంతో అతడు లేకుండానే ప్రారంభ మ్యాచ్ జరగనుంది. ఏప్రిల్ రెండో వారం నుంచి కోహ్లీ మ్యాచ్ లకు అందుబాటులోకి వస్తాడు.
ఇక ఎడమ చేతి భుజానికి చికిత్స కారణంగా కేఎల్ రాహుల్ ఐపీఎల్ కు దూరం అయ్యాడు. రవిచంద్ర అశ్విన్ కు ఆరు నుంచి ఎనిమిది వారాల విశ్రాంతి ఇచ్చారు. మణికట్టు గాయంతో, ఎడమచేతి భుజం నొప్పితోనూ బాధపడుతున్న మురళీ విజయ్ కు విశ్రాంతి తీసుకోవాలని బీసీసీఐ సూచించింది. దీంతో అతడూ దూరం కానున్నాడు. ఇక రవీంద్ర జడేజా, ఉమేశ్ యాదవ్ కు రెండు వారాల విశ్రాంతి కల్పించారు. ఈ సారి ప్రారంభమ్యాచ్ కు ఆతిథ్యమిస్తున్న హైదరాబాద్ మే 21న జరిగే ఫైనల్ మ్యాచ్ కూ వేదిక కానుంది. పదవ ఎడిషన్ 47 రోజుల పాటు మొత్తం 60 మ్యాచులతో కొనసాగనుంది.