: నాకు కాదు.. ఎమ్మెల్యేల‌ను షాపింగ్ చేసిన గ‌డ్క‌రీకి థ్యాంక్స్ చెప్పుకో: పారికర్ కు దిగ్విజయ్ చురకలు


ఇటీవ‌ల నిర్వ‌హించిన గోవా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీజేపీ కంటే అధిక స్థానాలు గెలుచుకున్న‌ప్ప‌టికీ స‌ర్కారు ఏర్పాటు చేయడంలో విఫలమైన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో త‌న‌కి థ్యాంక్స్ అంటూ గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ చుర‌క‌లు అంటించిన అంశంపై ఆ రాష్ట్ర కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ దిగ్విజ‌య్‌సింగ్ స్పందించారు. మ‌నోహ‌ర్ పారిక‌ర్ గోవా ప్ర‌జ‌లకు క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని ఆయ‌న తన ట్విట్ట‌ర్ ఖాతాలో పేర్కొన్నారు.

అయినా థ్యాంక్ చెప్పాల్సింది త‌న‌కు కాద‌ని, కేంద్ర మంత్రి నితిన్ గ‌డ్క‌రీకి చెప్పాల‌ని ఆయ‌న అన్నారు. ఆ రాష్ట్రంలో ప్ర‌భుత్వ ఏర్పాటు కోసం గ‌డ్క‌రీ ఎమ్మెల్యేల‌ను షాపింగ్ చేశార‌ని ఆయ‌న అన్నారు. అందుకే ఆయ‌న‌కు పారిక‌ర్ ధ‌న్య‌వాదాలు చెబితే బాగుంటుంద‌ని చుర‌క‌లు అంటించారు. అధికార దాహంతో బీజేపీ అధిష్ఠానం ఆ రాష్ట్రంలో ఎమ్మెల్యేల‌ను కొన్నార‌ని ఆయ‌న ఆరోపించారు. అది సిగ్గుచేటు చ‌ర్య అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. వారు ఆ రాష్ట్ర  ప్ర‌జ‌ల‌ను మోసం చేశార‌ని, వాళ్ల‌కు క్ష‌మాప‌ణలు చెప్పాల‌ని అన్నారు.





  • Loading...

More Telugu News