: ఏపీ రవాణ శాఖ మంత్రి సిద్ధా రాఘవరావుకు ఉద్వాసన?


ఏపీ మంత్రి వర్గ విస్తరణ జరగనుండటంతో ఆశావహులు ఇప్పటికే సీఎం చంద్రబాబును, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ను సంప్రదిస్తున్నారు. మరోపక్క, మంత్రి వర్గం నుంచి ఎవరికి ఉద్వాసన పలుకుతారనే విషయం సర్వత్ర చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో రవాణా శాఖ మంత్రి సిద్ధా రాఘవరావుకు ఉద్వాసన పలుకుతారని తెలుస్తోంది. ఎందుకంటే, ఆ పదవికి ఆయన సరైన న్యాయం చేయలేదని చంద్రబాబు భావిస్తున్నారట. అందుకే, సిద్ధాపై వేటు వేసే ఉద్దేశంలో చంద్రబాబు ఉన్నట్టు తెలుస్తోంది.

అయితే, ఈ విషయమై సరైన సమాచారం కోసం సిద్ధా, చంద్రబాబును కలిశారని తెలుస్తోంది. రవాణా శాఖ మంత్రిగా, నెల్లూరు జిల్లా ఇన్ ఛార్జి మంత్రిగా ఉన్న తనను పక్కన పెడితే కనుక మంత్రి నారాయణను కూడా తొలగించాలని చంద్రబాబుతో ఆయన అన్నట్టు తెలుస్తోంది. రవాణా శాఖా మంత్రిగా తాను కష్టపడి పని చేశానని, నెల్లూరు జిల్లాలో నేతలను కలుపుకునిపోయానని చంద్రబాబుకు సిద్ధా మొరపెట్టుకున్నారట. అయితే, ఈ మాటలను చంద్రబాబు పట్టించుకున్నారా? లేదా? అనే దానికి సమాధానం త్వరలోనే తెలియనుంది.

  • Loading...

More Telugu News