: ఆవులకు ‘బీరు’ పోసి పెంచుతున్నాడు!


బెల్జియంకు చెందిన హుగ్స్‌ డెర్జిలి అనే వ్య‌క్తి త‌న గోశాల‌లో ఆవులతో ప్ర‌తిరోజు బీరు తాగిస్తున్నాడు. బీరు తాగితే, ఆవులు బలంగా తయారవుతాయ‌ని చెబుతున్నాడు. ఆయ‌న త‌న‌ ప్రాంతంలో ఆవుమాంసం విక్రయిస్తూ వ్యాపారం చేసుకుంటాడు. మొద‌ట్లో తన ఆవుల‌కి పచ్చగడ్డి, దాణా వంటివే వేసేవాడిన‌ని, అయితే అవి మరింత బలంగా త‌యారుకావాల‌ని, అధికంగా మాంసం ఉత్పత్తి చేయాల‌ని గ‌త ఏడాది న‌వంబ‌రు నుంచి బీరుప‌డుతున్న‌ట్లు పేర్కొన్నాడు. ఆవులను బ‌లంగా ఎలా త‌యారు చేయాల‌నే అంశంపై తాను గూగుల్‌లో వెతికాన‌ని చెప్పాడు. జపాన్‌కు చెందిన కొందరు తమ ఆవులకు మసాజ్‌ చేస్తూ, సంగీతం వినిపించి ఆటలాడిస్తారని, వీటితో పాటు బీర్‌ కూడా పడుతున్నట్లు తాను తెలుసుకున్న‌ట్లు చెప్పాడు.

తాను ఇక ఆవుల‌కి బీరు తాగించ‌డం మొద‌లెపెట్టాన‌ని, మిగతా వాటి కంటే బీరు పోసి పెంచిన ఆవుల నుంచి మాంసం అధికంగా ఉత్పత్తి అవుతుంద‌ని అన్నాడు. ప్రస్తుతం త‌మ ప్రాంతంలో దొరికే సిలిన్రియక్స్‌ డార్క్‌ బీర్‌ను రోజుకు నాలుగు లీటర్ల చొప్పున తన ఆవులలోని రెండింటికి ఇస్తున్నాన‌ని చెప్పాడు.
 

  • Loading...

More Telugu News