: ‘కబాలి’ క్లిప్పింగ్స్ ను మలేషియా ప్రధాని ఇష్టపడ్డారు: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్


తన ఆహ్వానం మేరకు మలేషియా ప్రధాని నాజీబ్ రజాక్ తన నివాసానికి విచ్చేశారని తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ చెప్పారు. మలేషియా ప్రధానితో మాట్లాడిన అనంతరం రజనీకాంత్ మీడియాతో మాట్లాడుతూ, 'కబాలి 2' చిత్రం షూటింగ్ మలేషియాలో రెండు నెలల పాటు జరిగిందని, ఆ సమయంలో మలేషియా ప్రభుత్వం తమకు మద్దతుగా నిలిచిందని అన్నారు. ప్రధాని నజీబ్ రజాక్ చాలా బిజీగా ఉండటంతో ఆయన్ని అక్కడ కలవలేకపోయానని అన్నారు.

అయితే, చెన్నైలో నజీబ్ రజాక్ ఉండటంతో ఆయన్ని టీ పార్టీకి రావాలని ఆహ్వానించగా, ఆయన అంగీకరించడం, తన నివాసానికి రావడం జరిగిందని రజనీ కాంత్ చెప్పారు. కబాలి సినిమాకు సంబంధించిన కొన్ని క్లిప్పింగ్స్ ను ప్రధాని నజీబ్ రజాక్ చూశారని, ఆయన వాటిని ఇష్టపడ్డారని చెప్పారు. మరిన్ని సినిమాలు మలేషియాలో నిర్మించాలని ఆయన ఆహ్వానించారని చెప్పిన రజనీ, తాను రాజకీయాల్లోకి వస్తున్నానంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు.

  • Loading...

More Telugu News