: పొదుపు ఖాతాదారులకు నిరాశ... చిన్న మొత్తాలపై తగ్గిన వడ్డీ


పొదుపు ఖాతాదారులకు తీవ్ర నిరాశను మిగుల్చుతూ, పీపీఎఫ్ (పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్) సహా, ఇతర పొదుపు ఖాతాలపై వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్టు కేంద్రం ఈ ఉదయం ప్రకటించింది. పీపీఎఫ్, కిసాన్ వికాస్ పత్రాలు, సుకన్య సమృద్ధి స్కీమ్, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ తదితర అన్ని రకాల ఖాతాలపై 0.1 శాతం మేరకు వడ్డీని తగ్గిస్తున్నామని, ఏప్రిల్ 1 నుంచి నిర్ణయం అమలవుతుందని ఆర్థిక శాఖ తెలిపింది. కాగా, ప్రభుత్వ నిర్ణయంతో ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులు తామిస్తున్న వడ్డీ రేట్లను తగ్గించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇప్పటికే నోట్ల రద్దు కారణంగా రుణాల జారీ వృద్ధి తగ్గిన నేపథ్యంలో నిర్వహణా లాభాలను కొనసాగించేందుకు వడ్డీ రేట్లను తగ్గించక తప్పదని బ్యాకింగ్ రంగ నిపుణులు అంచనా వేశారు.

  • Loading...

More Telugu News