: జిల్లాకో మహిళా పోలీసుస్టేషన్


రాష్ట్రంలోని ప్రతి జిల్లాలోను మహిళల కోసం ప్రత్యేక పోలీసు స్టేషనులను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమౌతోంది. పూర్తిగా మహిళా సిబ్బందితో పనిచేసే విధంగా ఈ పోలీసు స్టేషన్లు రూపుదిద్దుకోనున్నాయి. ఎస్సీ,ఎస్టీ మహిళలపై పెరుగుతున్న నేరాలను అరికట్టేందుకు స్త్రీల కోసం ప్రత్యేకంగా పోలీసు స్టేషన్లు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నిర్ణయించారు.

హైదరాబాదు పరిధిలో రెండు మహిళా పోలీసు స్టేషన్లను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. మరోవైపు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో 25 శాతం తప్పుడు కేసులు నమోదవుతున్నట్లు అధికారులు తెలిపారు. 

  • Loading...

More Telugu News