: ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ ప్రమాణ స్వీకారానికి వేదిక ఖరారు
వచ్చేనెల 2న రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణ జరపాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ఈ రోజు వేదికను ఖరారు చేశారు. ఏపీ అసెంబ్లీ ఆవరణలోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని సర్కారు నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ ప్రారంభం రోజున సభ నిర్వహించిన ప్రదేశంలోనే ఈ ఏర్పాట్లు చేయాలని సర్కారు సాధారణ పరిపాలన శాఖను ఆదేశించినట్లు తెలుస్తోంది. ఆదివారం ఉదయం 9.25 గంటలకు ఈ కార్యక్రమం జరగనుంది.