: టెన్త్ ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో ప్రధాన నిందితుల అరెస్ట్!
ఏపీలో సంచలనం సృష్టించిన పదవ తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ, మాల్ ప్రాక్టీస్ కేసుల్లో ప్రధాన నిందితులను నెల్లూరు పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. వీరిని నేడు లేదా రేపు మీడియా ఎదుట హాజరు పరిచి మరిన్ని వివరాలను వెల్లడించనున్నట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఈ కేసు విచారణలో భాగంగా, నాలుగు పోలీసు బృందాలు ఏర్పడి, కీలక సమాచారాన్ని సేకరించి, పలువురిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిపాయి. ప్రస్తుతం వీరిని విచారిస్తున్నామని, కీలక సమాచారం వీరి నుంచి సేకరించామని, సాధ్యమైనంత త్వరలో వీరిని కోర్టు ఎదుట ప్రవేశపెడతామని అధికారులు చెప్పారు.