: నరసాపురం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఏపీ మంత్రులను అడ్డుకున్న వైసీపీ, సీపీఎం నేతలు
మొగల్తూరులోని ఆక్వాఫుడ్ ప్రాసెసింగ్ పార్కులో రసాయనాల ట్యాంకు శుభ్రం చేస్తుండగా ఐదుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. వారి మృతదేహాలను నరసాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు ఆసుపత్రి వద్దకు రాష్ట్ర మంత్రులు పీతల సుజాత, అయ్యన్న పాత్రుడు, మాణిక్యాలరావు వెళ్లారు. అయితే, అదే సమయంలో అక్కడకు వచ్చిన వైసీపీ, సీపీఎం నేతలు ఆసుపత్రి ముందు నిరసన చేపట్టారు. వారు మంత్రులను అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో చనిపోయిన వారి మృతదేహాలకు మృతుల కుటుంబ సభ్యుల సమక్షంలోనే పంచనామా జరిపి, పోస్టుమార్టం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.