: నన్ను నెంబర్ వన్ కాకుండా అడ్డుకుంటావు సరే...నువ్వు అవుతావా?: కరొలినా మారిన్ కు సైనా టిట్ ఫర్ టాట్


ఇండియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో కరొలినా మారిన్ చేసిన వ్యాఖ్యలకు సైనా నెహ్వాల్ దీటుగా సమాధానం చెప్పింది. తొలుత మారిన్ మాట్లాడుతూ, టోర్నీలో విజయం సాధించడమే లక్ష్యమని చెప్పింది. సైనాను వరల్డ్ నెంబర్ వన్ కాకుండా అడ్డుకుంటానని చెప్పింది. అనంతరం సైనా దీనిపై స్పందిస్తూ, నన్ను నెంబర్ వన్ కాకుండా అడ్డుకుంటావు సరే...మరి నువ్వు నెంబర్ వన్ కాగలవా? అంటూ టిట్ ఫర్ టాట్ ఇచ్చింది. తానెప్పుడూ ర్యాంకుల గురించి ఆడలేదని చెప్పింది. 30వ ర్యాంకులో ఉన్నప్పటి నుంచి తాను టోర్నీలు గెలవడం గురించే ఆలోచించానని చెప్పింది. టోర్నీలు గెలుస్తూ ఉంటే ర్యాంకులు ఆటోమేటిగ్గా మెరుగవుతాయని తెలిపింది. 

  • Loading...

More Telugu News