: కోహ్లీపై విమర్శలు చేసిన బ్రాడ్ హాడ్జ్ పై అశ్విన్ వెటకారపు ట్వీట్
ధర్మశాలలో జరిగిన చివరి టెస్టు మ్యాచ్ నుంచి భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ తప్పుకోవడానికి ఐపీఎల్ కారణమంటూ ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు బ్రాడ్ హాడ్జ్ పలు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే, తాను చేసిన వ్యాఖ్యలు కోహ్లీని కించపర్చడానికి కాదని, అలా మాట్లాడినందుకు క్షమాపణలు చెబుతున్నానని కూడా చెప్పాడు. కాగా, అటువంటి వ్యాఖ్యలు చేసి చివరకు సారీ చెబుతున్న ఆసీస్‌కి టీమిండియా ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ చురకలు అంటించాడు. క్షమాపణ చెబుతూ హాడ్జ్ పేర్కొన్న లేఖపై ట్విట్టర్ ద్వారా అశ్విన్ స్పందిస్తూ... క్రికెట్ అభిమానులకు ఒక సూచన చేశాడు. ఇక నుంచి మార్చి 30న అంతర్జాతీయ క్షమాపణ దినోత్సవంగా గుర్తిద్దామని వెటకారంగా ట్వీటు చేశాడు.
On a lighter note, from this year onwards 30th march will be remembered as world apology day.