: సరబ్ జిత్ మృతిపై దర్యాప్తుకు పాక్ ఆదేశం
కోట్ లఖ్ పత్ జైల్లో తోటి ఖైదీల దాడిలో గాయపడి చికిత్స పొందుతూ లాహోర్ ఆసుపత్రిలో మరణించిన భారతీయ ఖైదీ సరబ్ జిత్ సింగ్ వ్యవహారంపై పాకిస్తాన్ దర్యాప్తుకు ఆదేశించింది. సరబ్ జిత్ మరణంపై సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలన్న భారత ప్రధాని మన్మోహన్ సింగ్ విజ్ఞప్తికి పాక్ సర్కారు స్పందించింది. సరబ్ జిత్ పై దాడి చేసిన ఇద్దరు ఖైదీలపై కేసు నమోదు చేసినట్టు పాక్ వర్గాలు తెలిపాయి.