: గం. 9.30కు పరీక్ష ప్రారంభమైంది..గం. 9.25కే వాట్సప్‌లో ఫొటోలు తీసి పంపించారు: జగన్
పదవ తరగతి ప్రశ్నపత్రం లీక్ అంశంపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా ప్రభుత్వం చెబుతున్న కారణాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఖండించారు. ఉదయం గం. 9.30కు పరీక్ష ప్రారంభమైందని, అయితే నారాయణ ఉద్యోగి గం. 9.25కే వాట్సప్‌లో ఫొటోలు తీసి పంపించారని జగన్ ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా నారాయణ స్టాఫ్ అందరికీ ఆ మెసేజ్ పంపించారని అన్నారు. అందుకే నారాయణ విద్యాసంస్థలకు మంచి ర్యాంకులు వస్తోంటే.. ఇది ప్రభుత్వానికి మోసంలా కనపడడం లేదా? అని జగన్ ప్రశ్నించారు. పరీక్ష ప్రారంభానికి ముందే వాట్సప్ లో మెసేజ్ పంపిస్తే ప్రభుత్వం మాత్రం మరోలా కారణాలు చెబుతోందని ఆయన మండిపడ్డారు.