: లైంగిక వేధింపులకు పాల్పడిన టీవీఎఫ్ చీఫ్ అరునభ్ కుమార్ పై కేసు నమోదు
ఓ గుర్తు తెలియని మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడిన వెబ్ ఎంటర్ టెయిన్ మెంట్ సంస్థ 'ది వైరల్ ఫీవర్' వ్యవస్థాపకుడు అరునభ్ కుమార్ పై ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. అంధేరీ పోలీస్ స్టేషన్ లో ఐపీసీ సెక్షన్ 354 ఏ, 509 కింద ఆయనపై కేసు పెట్టినట్టు డీసీపీ అశ్వనీ సనాప్ పేర్కొన్నారు. అయితే ఇప్పటికింకా ఆయన్ను అరెస్ట్ చేయలేదని తెలిపారు.
కాగా, తనపై 2014 నుంచి మూడేళ్ల పాటు అరునభ్ వేధింపులకు పాల్పడ్డాడని ఓ గుర్తు తెలియని మహిళ సోషల్ మీడియాలో పోస్టు పెట్టడం, మరో యువతి సైతం ఇదే విధమైన ఆరోపణలు చేసిన నేపథ్యంలో కేసు పెట్టామని, బాధిత యువతి ఎవరన్న విషయాలు తెలియకుండా అరెస్ట్ చేయలేమని అశ్వనీ వెసనాప్ తెలిపారు.