: ఏపీ అసెంబ్లీలో ఫస్ట్ టైం... ఆరడుగుల ఎత్తులో ఉన్న స్పీకర్ పోడియంను ఎక్కేసిన వైసీపీ సభ్యులు
అమరావతి అసెంబ్లీ సమావేశాల్లో నేడు తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. టెన్త్ ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో వెంటనే చర్చించేందుకు అనుమతించాలని కోరుతూ నినాదాలతో మొదలు పెట్టిన వైకాపా ఎమ్మెల్యేలు, సుమారు ఆరు అడుగుల ఎత్తులో ఉన్న స్పీకర్ పోడియంను ఎక్కేశారు. ఇన్ని రోజులూ నిత్యమూ పోడియం కింద నిలబడి మాత్రమే నిరసనలు చెబుతున్న వైకాపా, రేపటితో సభ ముగుస్తుందనగా స్పీకర్ చైర్ ను సమీపించి, ఇరువైపులా నిలబడి నినాదాలు చేశారు.
"నారా వారి బినామీ నారాయణ", "ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం", "విద్యార్థులకు న్యాయం చేయాలి" అంటూ నినాదాలు చేస్తూ, ప్లకార్డులు ప్రదర్శించారు. విలువైన సభా సమయాన్ని వృథా చేయవద్దని స్పీకర్ కోడెల పలుమార్లు విజ్ఞప్తి చేస్తున్నా ఎవరూ వినే పరిస్థితిలో లేరు.