: దాహంతో ఊర్లో చొరబడ్డ కింగ్ కోబ్రా... వాటర్ బాటిల్ తో నీరు పట్టించిన వైనం... మీరూ చూడండి!


కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో ఎండలు మండిపోతున్నాయి... దీంతో అక్కడి పరిసరాలు కరవును తలపిస్తున్నాయి. ఎటు చూసినా తాగు నీరు కనిపించడం లేదు. దీంతో దాహానికి ఆగలేకపోయిన ఒక కింగ్ కోబ్రా (నల్లతాచు) జనావాసాల్లోకి చొరబడింది. ఈలోగా అది పాముల గురించి తెలిసిన ఓ వ్యక్తి కంట పడింది. దాహంతోనే అది అడవిని వదిలి గ్రామంలోకి వచ్చిందని గుర్తించిన ఆ వ్యక్తి స్థానిక అటవీ అధికారుల సాయంతో దానికి వాటర్ బాటిల్ తో నీరు తాగించాడు. అది కూడా బుద్ధిగా నీరు తాగింది. ఈ నల్లతాచు నీరు తాగుతుండగా ఓ వ్యక్తి వీడియో తీసి ఆన్ లైన్ లో పెట్టగా, అది వైరల్ అయింది. అనంతరం దానిని జంతు సంరక్షణ కేంద్రానికి తరలించారు. ఈ వీడియోను మీరు కూడా చూడండి.

  • Loading...

More Telugu News