: చెలరేగి ఆడి తమిళనాడు జట్టుకు విజయం అందించిన దినేష్ కార్తీక్
దేశవాళీ క్రికెట్ లో తమిళనాడు జట్టు అప్రతిహత విజయాలతో దూసుకెళ్తోంది. ఈ మధ్యే విజయ్ హజారే ట్రోఫీ ఫైనల్స్ లో బెంగాల్ జట్టును మట్టికరిపించిన తమిళనాడు మరోసారి జూలు విదిల్చింది. విశాఖపట్టణం వేదికగా జరుగుతున్న దేవధర్ ట్రోఫీ ఫైనల్స్ లో భారత్ బి జట్టును ఓడించి టైటిల్ ఎగరేసుకుపోయింది. విశాఖపట్టణంలోని ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో దినేశ్ కార్తీక్ చెలరేగి ఆడాడు. దినేష్ కార్తీక్ 91 బంతుల్లో 126 పరుగులతో చెలరేగి ఆడడంతో తమిళనాడు జట్టు 303 పరుగులు చేసింది. భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఇండియా బి కేవలం 261 పరుగులకే పరిమితమైంది. దీంతో టైటిల్ ను తమిళనాడు సొంతం చేసుకుంది.