: రక్షణ విషయంలో పోలీసులు జాగ్రత్తగా మసలుకోవాలి: కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ప్రగతి భవన్ లో ఈ రోజు జరిగిన ఉగాది వేడుకల్లో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. పండితులు సంతోష్ కుమార్ శర్మ పంచాంగ పఠనం తర్వాత సీఎం మాట్లాడారు. హేవళంబి అద్భుతమైన ఫలితాలు ఇస్తుందని చెప్పడంతో తనకు ఆనందంగా ఉందన్నారు. సంతోష శర్మ శుభగ్రహ దృష్టి ఉండడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని, వర్షాలు బాగా కురుస్తాయని, పంటలు బాగా పండుతాయని చెప్పారని, ఇంతకంటే మనకు కావాల్సిందేముందన్నారు. అంతా బాగా జరగాలని కోరుకుందామన్నారు. అయితే, పోలీసులు జాగ్రత్తగా ఉండాలని పండితులు చెప్పారు గనుక... భద్రత విషయంలో జాగ్రత్తగా మసలుకోవాలని సూచించారు.