: బంగారంతో చేసిన షూ... వెల రూ.17 లక్షలు


బంగారం కేవలం ఆభరణాలకే పరిమితం కాలేదు. పాదరక్షల్లోకి కూడా చేరిపోయింది. ప్రపంచంలో మొదటిసారిగా బంగారంతో షూలు తయారయ్యాయి. వెల అక్షరాలా రూ.17 లక్షలు. ఇటలీకి చెందిన ఆంటోనియో అనే వ్యక్తి బంగారం, లెదర్ తో చూడచక్కని షూలను తయారు చేశాడు.  24 క్యారట్ల 230 గ్రాముల బంగారం ఒక షూ తయారీలో వినియోగించాడు. ఆంటోనియో తయారు చేసే ప్రత్యేకమైన షూలకు ప్రధానంగా సౌదీ అరేబియా, ఖతార్, యూఏఈ వంటి దేశాల్లో మంచి డిమాండ్ ఉంది. దీంతో ఈ బంగారం షూ సైతం హాట్ కేకుల్లా అమ్మడు పోవడం ఖాయమే.

  • Loading...

More Telugu News