: సంస్కారం లేని ఆ నిర్మాతలతో నేను పని చేయలేను: శరత్ కుమార్ కుమార్తె వరలక్ష్మి
సినీ రంగంలో హీరోయిన్లపై జరుగుతున్న లైంగిక వేధింపుల గురించి ప్రముఖ నటుడు శరత్ కుమార్ కుమార్తె, హీరోయిన్ వరలక్ష్మి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా సినీ పరిశ్రమలో నెలకొన్న కుసంస్కారంపై ఆమె మరోసారి మండిపడింది. తమిళంలో విజయం సాధించిన 'అప్పా' అనే సినిమాను మలయాళంలో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాలో జయరాం హీరోగా నటిస్తుండగా, సముద్రగని దర్శకత్వం వహిస్తున్నారు. జయరాంకు జోడీగా వరలక్ష్మి నటిస్తోంది. మూడు రోజుల క్రితం ఈ సినిమా షూటింగ్ ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి వరలక్ష్మి కూడా హాజరైంది. కానీ, ఇంతలోనే ఆ సినిమా నుంచి తప్పుకుంటున్నట్టు ఆమె ప్రకటించింది.
ఈ సినిమా నిర్మాతలతో తాను పని చేయలేనని వరలక్ష్మి తెలిపింది. సభ్యత, సంస్కారం లేని వారితో తాను పని చేయనని చెప్పింది. ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంటున్నానని తెలిపింది. అయితే జయరాం, సముద్రగనిలతో కలసి భవిష్యత్తులో తప్పకుండా పని చేస్తానని చెప్పింది.