: బ్రిటన్ నుంచి స్కాట్లాండ్ ఔట్!.. రెఫరెండానికి అంగీకారం


యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న స్కాట్లాండ్ బ్రిటన్ నుంచి విడిపోవాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు ప్రజాభ్రిపాయాన్ని కోరాలని నిర్ణయించింది. గతంలో ఒకసారి ఇదే విషయమై ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించగా బ్రిటన్‌తో కలిసి ఉండేందుకే స్కాట్లాండ్ వాసులు మొగ్గుచూపారు. అయితే ఈయూ నుంచి బ్రిటన్ విడిపోయిన తర్వాత అసంతృప్తిగా ఉన్న స్కాట్లాండ్ మరోమారు ఇదే ప్రతిపాదన తెచ్చింది. బ్రిటన్ నుంచి విడిపోయేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది. ఈ మేరకు ఎడిన్‌బర్గ్ ‌లో సమావేశమైన స్కాట్లాండ్ చట్టసభ్యులు రెఫరెండానికి అనుకూలంగా ఓటేశారు. అనుకూలంగా 69, వ్యతిరేకంగా 59 ఓట్లు వచ్చాయి. దీంతో స్వతంత్ర దేశంగా ఉండేందుకు రెఫరెండం నిర్వహించాలని బ్రిటన్ ప్రభుత్వాన్ని స్కాట్లాండ్ అధికారికంగా కోరింది.

  • Loading...

More Telugu News