: ధోనికి ‘పద్మ’ అవార్డు నిరాకరణ
ప్రభుత్వం ఈ ఏడాది ఇవ్వనున్న పద్మ అవార్డులకు పలువురి పేర్లను తిరస్కరించింది. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని, ఆధ్యాత్మిక గురువు గుర్మీత్ రామ్ రహీం సింగ్, తబలా విద్వాంసుడు జాకీర్ హుస్సేన్‌లకు పద్మ అవార్డులను నిరాకరించింది. ఇంకా రాజ్యసభ ఎంపీ జయాబచ్చన్, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల, గాయకుడు సోను నిగమ్, నటి శ్రీదేవి, ప్రముఖ పాత్రికేయుడు అర్నాబ్ గోస్వామి, ఫ్యాషన్ డిజైనర్ రోహిత్ బాల్ తదితరులకు కూడా పద్మ అవార్డులను నిరాకరించింది. ఇలా మొత్తం 18 వేలకుపైగా సిఫార్సులు, దరఖాస్తులు తిరస్కరణకు గురికాగా, వాటి వివరాలను కేంద్ర హోంమంత్రిత్వ శాఖ విడుదల చేసింది.