: 46 ఏళ్ల క్రితం తెలుగు నేల నాకు రెండో జన్మ ఇచ్చింది.. గుర్తు చేసుకున్న గవర్నర్ నరసింహన్
నేటికి సరిగ్గా 46 ఏళ్ల క్రితం తెలుగు నేలపై తాను పునర్జన్మ పొందానని ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ గుర్తు చేసుకున్నారు. ఉగాది రోజున తనకు ప్రమాదం జరిగితే 45 రోజులు కోమాలోకి వెళ్లిపోయానని, కర్నూలులో చికిత్స పొంది పునర్జన్మ పొందానని తెలిపారు. ఆ రకంగా తెలుగు భూమి తనకు రెండో జన్మ ఇచ్చిందన్నారు. తాను తెలుగు నేలపైనే చదువుకున్నానని, తొలి ఉద్యోగం చేసింది కూడా తెలుగు భూమిపైనేనని అన్నారు. ఉగాది సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. రెండు తెలుగు రాష్ట్రాలు సమృద్ధిగా ఉండాలని ఆకాంక్షిస్తున్నట్టు చెప్పారు.