: ఫుట్ బాల్ ఆటగాడు మెస్సీపై నిషేధం, జరిమానా!
ప్రపంచ ప్రఖ్యాత ఫుట్ బాల్ ఆటగాడు లియెనెల మెస్సీకి పీఫా భారీ షాక్ ఇచ్చింది. ప్రపంచం మెచ్చే ఫుట్ బాల్ ఆటగాడు, అర్జెంటీనా ఫుట్ బాల్ జట్టు కెప్టెన్ లియెనెల్ మెస్సీపై పీఫా వేటు వేసింది. మార్చి 23న చిలీ, అర్జెంటీనా మధ్య మ్యాచ్ సందర్భంగా లైన్ అంపైర్ ను మెస్సీ అసభ్య పదజాలంతో దూషించాడు. దీనిపై విచారించిన అంతర్జాతీయ ఫుట్ బాల్ సమాఖ్య (ఫిఫా) అతనిపై 4 మ్యాచ్ ల నిషేధం, 10 వేల స్విస్ ఫ్రాంక్ (రూ.6.6 లక్షలు) ల జరిమానా విధించింది. మరికొన్ని గంటల్లో బొలీవియాతో మ్యాచ్ కు మెస్సీ సిద్ధమవుతుండగా పీఫా ఈ నిర్ణయం ప్రకటించింది. దీంతో మెస్సీ అభిమానులు షాక్ కు గురయ్యారు. ప్రపంచంలోని అత్యుత్తమ ఫుట్ బాల్ ఆటగాళ్లలో మెస్సీ ఒకడన్న సంగతి తెలిసిందే.