: అతిపెద్ద తప్పు చేశామనే విషయం అమెరికాకు చిన్నగా అర్థమవుతోంది: వర్మ వెరైటీ ట్వీట్


దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏ అంశంపైన అయినా సరే, స్పందిస్తారని చెప్పడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. తాజాగా, అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ను ఎన్నుకున్న అమెరికాపై ఆయన ట్వీట్ చేశారు. ‘అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ను ఎన్నుకోవడమే తమ జీవితంలో చేసిన అతిపెద్ద తప్పు అనే విషయాన్ని అక్కడి ప్రజలు నిదానంగా గ్రహిస్తున్నారని నేను అనుకుంటున్నాను’ అని వర్మ తన ట్వీట్ లో పేర్కొన్నారు. కాగా, వర్మ చేసిన ఈ ట్వీట్ లో మరో ప్రత్యేకత ఉంది. ఈ ట్వీట్ కు మొత్తం 17 పదాలను వర్మ ఉపయోగించారు. అందులో మొదటి, నాలుగు, పది, పదిహేను పదాలను మినహాయిస్తే, మిగిలిన 13 పదాల్లో మొదటి అక్షరం లేకుండా ఈ ట్వీట్ చేయడం ప్రత్యేకతగా చెప్పవచ్చు. 

  • Loading...

More Telugu News