: త్వరలోనే మళ్లీ తెలుగులో నటిస్తా: ‘బన్నీ’ హీరోయిన్ గౌరీ ముంజల్
సుమారు పదకొండు సంవత్సరాల క్రితం విడుదలైన బన్నీ చిత్రంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సరసన నటించిన అందాల భామ గౌరీ ముంజల్ గుర్తుండే ఉంటుంది. ఆ తర్వాత తెలుగు సినిమాల్లో కనిపించ లేదు. అయితే, హైదరాబాద్ లో జరుగుతున్న ఐఫా వేడుకలకు ఆమె హాజరైంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, హైదరాబాద్ లో ఐఫా వేడుకలు నిర్వహించడం చాలా బాగుందని, హైదరాబాద్ లో ఏదో తెలియని ఆకర్షణ ఉందని, ఇక్కడికి రావడం తనకు సంతోషంగా ఉందని చెప్పుకొచ్చింది. త్వరలోనే మళ్లీ తెలుగు సినిమాల్లో నటిస్తానని ఒక ప్రశ్నకు సమాధానంగా ఆమె చెప్పింది.