: అనిల్ అంబానీకి అరుదైన గౌరవం.. ‘ది అట్లాంటిక్ కౌన్సిల్’లో సభ్యత్వం!


ప్రముఖ వ్యాపారవేత్త అనిల్ అంబానీకి అరుదైన గౌరవం లభించింది. ‘ది అట్లాంటిక్ కౌన్సిల్’లో సభ్యుడిగా ఆయనకు స్థానం దక్కింది. ఈ విషయాన్ని రిలయన్స్ సంస్థ ఓ ప్రకటనలో పేర్కొంది. అనిల్ అంబానీని అంతర్జాతీయ సలహా మండలిలో సభ్యుడిగా చేస్తూ ది అట్లాంటిక్ కౌన్సిల్ ప్రకటించిందని ఆ ప్రకటనలో పేర్కొంది. కాగా, అనిల్ కు సభ్యత్వం ఇవ్వడం ద్వారా ఆయనతో కలిసి వివిధ స్థాయుల్లో పని చేస్తామని ది అట్లాంటిక్ కౌన్సిల్ చైర్మన్ జాన్ ఎం హంట్స్ మెన్ పేర్కొన్నారు.

అనిల్ కు సభ్యత్వం ఇవ్వడం ద్వారా దక్షిణాసియాలో మండలికి ప్రాతినిధ్యం లభించిందని అన్నారు. ‘ది అట్లాంటిక్ కౌన్సిల్’లో సభ్యత్వం లభించడంపై అనిల్ అంబానీ స్పందిస్తూ, ఈ ఆహ్వానాన్ని తాను మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నానని, ‘ది అట్లాంటిక్ కౌన్సిల్’లో ఇప్పటి వరకు అమెరికా ప్రాధాన్యం కొనసాగేదని అన్నారు. అయితే, ప్రధాని మోదీ నేతృత్వంలో భారత్ భౌగోళికంగా, రాజకీయంగా ప్రభావవంతమైన దేశంగా గుర్తింపు పొందుతోందని చెప్పడానికి ఈ సంఘటనే నిదర్శనమన్నారు. కాగా, ‘ది అట్లాంటిక్ కౌన్సిల్’ అనేది విదేశీ విధానాల మేధోవర్గ బృందం.

  • Loading...

More Telugu News