: రద్దీ మార్కెట్లో యువతిని తుపాకీతో కాల్చి చంపిన వ్యక్తి
హర్యానాలోని గుడ్‌గావ్‌లో దారుణం చోటుచేసుకుంది. ఆ ప్రాంతంలోని చౌమా గ్రామానికి చెందిన పవన్ కుమార్ అనే 28 ఏళ్ల ఓ వ్యక్తి రద్దీ మార్కెట్లో 18ఏళ్ల యువతిని తుపాకీతో కాల్చి చంపేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పలు వివరాలు తెలిపారు. బాధితురాలు పలమ్ విహార్ సెక్టార్ 21 ప్రాంతంలోని పతంజలి స్టోర్‌లో సేల్స్‌గర్ల్‌గా పనిచేసే గుంజాన్‌గా తాము గుర్తించామని చెప్పారు. ఆ యువతి పతంజలి స్టోర్‌లో పని ముగించుకుని బయటకు రాగానే అక్కడే ఉన్న పవన్ కాల్పులు జరిపాడని తెలిపారు. ఆమెను ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయిందని అన్నారు. నిందితుడు తన కూతురును గత కొన్నాళ్లుగా వేధిస్తున్నాడని గుంజాన్ తండ్రి పోలీసులకు చెప్పాడు. నిందితుడు పరారీలో ఉన్నాడని, అతడి కోసం గాలిస్తున్నామని పోలీసులు చెప్పారు.