: ‘హేమలంబ’లో దేశాన్ని, రాష్ట్రాన్ని పాలించే వారికి ఇబ్బందులు తప్పవు: శారదా పీఠాధిపతి
‘హేమలంబ’ నామ సంవత్సరంలో.. దేశాన్ని, రాష్ట్రాన్ని పాలించే వారికి ఇబ్బందులు తప్పవని శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి అన్నారు. గ్రహాల స్థితిగతులు అనుకూలంగా లేనందున ఎండలు పెరగడం తద్వారా ప్రజలు ఇబ్బంది పడటం జరుగుతుందని, ఈ ఏడాది అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు కాలసర్ప దోషం ఉందని, రాజకీయ నేతలకు కొత్త ఏడాది గడ్డు కాలమేనని, ప్రభుత్వం విజ్ఞతతో యజ్ఞయాగాలు చేస్తే మేలు జరుగుతుందని స్వరూపానందేంద్ర సరస్వతి చెప్పారు.