: ప్రశ్నలు అడుగుతారు.. సమాధానాలు చెప్పకుండా వారే అడ్డుకుంటారు: అనిత


అసెంబ్లీలో వైసీపీ నేతలు ప్రవర్తిస్తున్న తీరు పట్ల టీడీపీ ఎమ్మెల్యే అనిత అభ్యంతరం వ్యక్తం చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్ లో ఆమె మాట్లాడుతూ, 12 రోజుల నుంచి బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయని... ఈ సందర్భంగా క్వశ్చన్ అవర్లో ఎక్కువ ప్రశ్నలు అడిగింది వైసీపీ సభ్యులే అని చెప్పారు. ప్రశ్నలు వాళ్లే అడుగుతారని... సమాధానం చెబుతుంటే మళ్లీ వాళ్లే అడ్డుకుంటారని విమర్శించారు. ఇంత వరకు జరిగిన ఏ ఒక్క బీఏసీ సమావేశానికి కూడా ప్రతిపక్ష నేత జగన్ హాజరు కాలేదని దుయ్యబట్టారు. బీఏసీ సమావేశాలకు హాజరైన వైసీపీ సభ్యులు సమావేశంలో ఏదైతే ఒప్పుకుంటారో... సభలో దానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తారని మండిపడ్డారు.

  • Loading...

More Telugu News