: ఎమ్మెల్సీగా లోకేశ్ ప్రమాణ స్వీకారోత్సవానికి ముహూర్తం ఖరారు
తెలుగుదేశం పార్టీ యువనేత, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఇటీవలే ఎమ్మెల్సీగా ఎన్నికైన విషయం తెలిసిందే. ఆయన ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైంది. ఎల్లుండి ఉదయం 9.45 గంటలకు ఆయనతో శాసనమండలి ఛైర్మన్ చక్రపాణి తన కార్యాలయంలో ప్రమాణస్వీకారం చేయించనున్నారు. కొన్ని రోజుల క్రితం ఎమ్మెల్యేల కోటాలో లోకేశ్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికయ్యారు. ఆయనను త్వరలోనే ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గంలోకి తీసుకుంటారని వార్తలు వస్తోన్న విషయం తెలిసిందే.