: మరో దాడి.. స్టూళ్లు, చెత్త డబ్బాలతో నోయిడాలో విదేశీయుడిపై దాడి


ఇటీవ‌లే నోయిడాలో నైజీరియ‌న్ల‌పై జ‌రిగిన దాడి క‌ల‌క‌లం రేపిన విష‌యం తెలిసిందే. ఆ దాడిపై కేంద్రమంత్రి సుష్మాస్వ‌రాజ్ కూడా స్పందించి, యూపీ ముఖ్య‌మంత్రితో మాట్లాడారు. ఆ దాడి మ‌ర‌వ‌క‌ముందే మ‌రో దాడి జ‌రిగిన‌ట్లు చూపిస్తోన్న ఓ వీడియో ప్ర‌స్తుతం మ‌రోసారి అల‌జ‌డి రేపుతోంది. నోయిడాలోని అన్సల్‌ ప్లాజా షాపింగ్‌ మాల్‌లో ఓ ఆఫ్రికన్‌పై కొందరు దుండ‌గులు అందరూ చూస్తుండగానే స్టూళ్లు, చెత్త డబ్బాలతో దాడి చేశారు. చేతికందిన దానితో కొడుతూ గాయ‌ప‌ర్చారు. ఈ దృశ్యాల‌ను అదే మాల్‌లోని మొదటి అంతస్తు నుంచి ఓ వ్యక్తి త‌న‌ మొబైల్‌లో వీడియో తీయ‌గా ఆఫ్రికన్‌ స్టూడెంట్స్‌ అసోసియేషన్‌ ఈ వీడియోను సోషల్‌ మీడియాలో షేర్ చేసింది. ఈ దాడిపై పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News