: పవన్ అభిమానులను చదువులేని గొర్రెలతో పోల్చిన వర్మ!


పవన్ కల్యాణ్ అభిమానులపై ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి ఫైర్ అయ్యాడు. కాటమరాయుడు సినిమా రిజల్ట్ తో పాటు, ఆయన అభిమానుల అత్యుత్సాహంపై కామెంట్ చేసిన వర్మపై... అదే స్థాయిలో పవన్ అభిమానులు విరుచుకుపడ్డారు. రామ్ గోపాల్ వర్మ హఠాత్తుగా చనిపోయాడని, దీంతో సినీ పరిశ్రమకు పట్టిన పీడ తొలగిపోయిందంటూ సినీ ప్రముఖులు ఆనంద బాష్పాలతో నివాళులు అర్పిస్తున్నారంటూ ఓ ఫొటోను సోషల్ మీడియాలో ఉంచారు.

ఈ పోస్టుపై వర్మ తనదైన శైలిలో స్పందించాడు. 'లవ్యూ టూ మై డియర్ స్వీట్ డార్లింగ్ లవ్లీ బ్యూటీఫుల్ క్యూట్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్. మీ అందరికీ ఒక పెద్ద హగ్' అంటూ ట్వీట్ చేశాడు. అంతేకాదు పవన్ అభిమానులను చదువుసంధ్యలు లేని గొర్రెలతో పోల్చాడు. 'చదువులేని గొర్రెలు ఒక విషయాన్ని అర్థం చేసుకోవడం లేదు. మూడు జన్మలకు ముందే నేను చనిపోయా. ప్రస్తుతం నేను ఒక దెయ్యాన్ని. దెయ్యాలకు మరణం లేదు. చావులోనే అవి బతికుంటాయ్' అంటూ ట్విట్టర్ లో కామెంట్ చేశాడు.

  • Loading...

More Telugu News