: నేను గర్భవతిని కాను.. మిమ్మల్ని నిరాశపరుస్తున్నందుకు సారీ: బిపాషా బసు
బాలీవుడ్ హీరోయిన్ బిపాషా బసు గర్భవతి అంటూ బీ టౌన్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. నటుడు కరణ్ సింగ్ గ్రోవర్ ను పెళ్లి చేసుకున్న బిపాషా... ప్రస్తుతం గర్భవతి అంటూ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అయితే ఈ వార్తలను బిపాషా ఖండించింది. తాను గర్భవతి కావాలని చాలా మంది ఆత్రుతగా ఉన్నారని... అయితే, తాను గర్భవతిని కాదని, మిమ్మల్ని నిరాశపరుస్తున్నందుకు సారీ అని చెప్పింది. పిల్లల్ని కనాలనే ఆలోచన తమకు ప్రస్తుతానికి లేదని ట్వీట్ చేసింది.
పిల్లల్ని కనడం చాలా సంతోషకరమైన విషయమని... ఆ సందర్భం వస్తే తప్పకుండా అందరితో పంచుకుంటానని చెప్పింది. తాను గర్భం దాల్చినట్టు ప్రతిసారి ఊహించేసుకోవడం తనకు చికాకును కలిగిస్తోందని అసహనం వ్యక్తం చేసింది. ముక్కు సూటిగా ఉండే తాను ఏ విషయం గురించైనా సూటిగా చెబుతానని తెలిపింది. మీడియాలో వస్తున్న వార్తలను నమ్మవద్దని కోరింది.