: బాలీవుడ్ నటికి నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్


బాలీవుడ్ నటి మమతా కులకర్ణి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. థానే లోని ప్రత్యేక కోర్టు మమతా కులకర్ణితో పాటు, ఇంటర్నేషనల్ డ్రగ్స్ స్మగ్లర్ వికీ గోస్వామికి నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. రూ. 2 వేల కోట్ల విలువైన డ్రగ్ రాకెట్ కేసులో వీరిద్దరూ కీలక నిందితులుగా ఉన్నారు. ఈ కేసు వెలుగు చూసినప్పటి నుంచి వీరిద్దరూ అజ్ఞాతంలోకి వెళ్లారు. మరోవైపు వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారని విశ్వసనీయ సమాచారం.

డ్రగ్ రాకెట్ కేసులో వీరిద్దరికీ సంబంధమున్నట్టు బలమైన సాక్ష్యాలు ఉన్నాయని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించారు. ఈ కేసులో వీరిద్దరే ప్రధాన నిందితులని... వీరిపై అరెస్ట్ వారెంట్ జారీ చేయాలని కోర్టును కోరారు. భారత్, కెన్యాలలో డ్రగ్ రాకెట్ ను వీరు నిర్వహిస్తున్నారని తెలిపారు. కెన్యాలోని ఓ హోటల్ లో మమత, గోస్వామి, ఇతర నిందితులు సమావేశమైనట్టు విచారణలో తేలిందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలోనే వీరిద్దరికీ కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. 

  • Loading...

More Telugu News