: గౌతమీపుత్ర శాతకర్ణి కేసు విషయంలో... నందమూరి బాలకృష్ణకు హైకోర్టు నోటీసులు


ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణకు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆయనతో పాటు గౌతమీపుత్ర శాతకర్ణి, రుద్రమదేవి సినిమాల నిర్మాతలకు కూడా నోటీసులు ఇచ్చింది. వివరాల్లోకి వెళ్తే, ఈ రెండు సినిమాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వినోదపు పన్ను నుంచి మినహాయింపును ఇచ్చింది. శాతకర్ణి సినిమాకు మాత్రం ఏపీ ప్రభుత్వం పన్నును మినహాయించింది. ఈ నేపథ్యంలో, వినోదపు పన్ను మినహాయింపును ప్రేక్షకులకు మాత్రమే చెందేలా ఆదేశాలు ఇవ్వాలంటూ హైకోర్టులో ఓ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. తన పిటిషన్ లో గతంలో తమిళనాడుకు సంబంధించిన ఓ తీర్పును పిటిషనర్ ప్రస్తావించారు. పిటిషన్ ను విచారించిన హైకోర్టు బాలయ్యతో పాటు శాతకర్ణి, రుద్రమదేవి చిత్ర నిర్మాతలకు నోటీసులు జారీ చేసింది. అంతేకాదు, తమ నోటీసులకు రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.  

  • Loading...

More Telugu News